
ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్ : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై అక్రమ కేసులు, అరెస్ట్‌కు నిరసనగా నిజం గెలవాలి కళ్ళు తెరిపిద్దాం నిరసన కార్యక్రమం మండలంలోని కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. అలాగే మండలంలోని నర్సిపురం, తాళ్లబురిడి, జమదాల గ్రామాలతో పాటు పట్టణంలోని పాత బస్టాండ్‌లో టిడిపి నాయకులు కళ్లకు గంతలు కొట్టుకొని తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కూనపురెడ్డి ప్రసాద్, ఐటిడిపి ఛాంపియన్ తాడ్డి ప్రవీణ్, జోజి, బార్నాల సీతారాం గొట్టాపు వెంకటరమణ గొట్టాపు వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: కళ్లకు గంతలతో టిడిపి నాయకులు, కార్యకర్తలునిరసన వ్యక్తం చేశారు.నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ ఆధ్వర్యాన చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కుట్రపూరితంగా వైసిపి ప్రభుత్వం జైల్లో పెట్టిందని సంధ్యారాణి ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి :మండలంలోని నాగూరులో జగనాసర పాలనకు నిరసనగా కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని మండల టిడిపి అధ్యక్షులు అక్కేన మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో నిజం గెలవాలి అని నినాదాలతో కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి అక్కేన. జగదీశ్వరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.