Oct 01,2023 00:21

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన శనివారం మోత మోగిద్దాం... కార్యక్రమాలను శనివారం పలుచోట్ల నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్‌ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో 17వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.కొండబాబు, మల్లిపూడి వీరు నల్ల కండువాలు వేసి దీక్షను ప్రారంభించారు. మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, పేరాబత్తుల రాజశేఖర్‌, వాసిరెడ్డి ఏసుదాసు, చప్పిడి వెంకటేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. తుమ్మల సునీత, గాది శివరామకృష్ణ, వాసంశెట్టి చిట్టప్ప, తుమ్మల కొండలరావు, పేకేటి సూర్య భాస్కర్‌ రావు, బాసి వెంకటరమణారెడ్డి, ఎండి జముల్లా ఖాన్‌, ఎస్‌కె.కరీముల్లా, మొహిద్దీన్‌, నీలాపు రామలక్ష్మి, కారంపూడి స్వాతి, రేసు అన్నవరం, ఆకేటి గోవిందరావు, గంపల లక్ష్మణరావు, కాసరపు శివాజీ, పరిమి భద్రరావు, శ్రీనివాస్‌, జాగు దావీదు, నిద్రబింగి సత్తిబాబు, జొన్న వెంకన్న, బొడ్డు రాజకుమార్‌ పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి వలసపాకల సెంటర్‌లో 'మోత మోగిద్దాం'' కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మేము సైతం రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. బోళ్ల కృష్ణమోహన్‌, దాయన రాంప్రసాద్‌, తాతపూడి రామకృష్ణ, పేరాబత్తుల లోవబాబు, కాళ్ల శ్రీను, పలివెల త్రిమూర్తులు, యాళ్ల రాజా, గుబ్బల సత్తిబాబు, పడమటి వీరబాబు, చాట్రాతి సాయిబాబా, గంజా రాంబాబు, నరుకుర్తి ప్రసాద్‌, సూరంపూడి రాజు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ పి.వేమవరంలో ముసిరెడ్డి బ్రదర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్‌, తోటకూర శ్రీనివాస్‌, గుమ్మళ్ల రామకృష్ణ, సర్పంచ్‌ పెంకే వెంకటేష్‌, చల్లా బుజ్జి పాల్గొన్నారు. పెద్దాపురం టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు నవీన్‌ కుమార్‌ చేపట్టిన పాదయాత్ర మర్లావ గ్రామంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా నిమ్మకాయల రంగనాగ్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు అధ్యక్షులు ఎలిశెట్టి నాని, తోట రామకృష్ణ, మేడిది శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పలు గ్రామాల్లో మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. మర్లావ గ్రామంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌ కంచాలపై కొడుతూ, విజిల్స్‌ వేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాగ్‌, ఎలిశెట్టి నాని, చాగంటి గోపాలకృష్ణ, మేడిది శ్రీనివాస్‌, కట్టమూరులో ఏలేటి సుబ్బారావు, సూర్యావతి, ఉమావతి, వీరబాబు, దుర్గాప్రసాద్‌, మోహన్‌ రావు పాల్గొన్నారు. తాళ్లరేవు సంతపేట సెంటర్లో మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, మల్లాడి వరదరాజు, జక్కల ప్రసాద్‌ బాబు, మురళి, పొన్నమండ రామలక్ష్మి, ఉమామహేశ్వరి, జయలక్ష్మి, సోమరాజు, పెమ్మాడి కృష్ణవేణి పాల్గొన్నారు.