Oct 24,2023 20:28

కురుపాం.. జగనాసుర దహనంలో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమాన్ని టిడిపి కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో తాడికొండ గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడు పీడ పోవాలని నినాదాలు చేశారు. సైకో పోవాలి అని పేపర్‌పై రాసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి యూనిట్‌ ఇన్‌ఛార్జి అడ్డాకుల నరేష్‌, మండంగి త్రినాథ, తోయక గణపతి, దొర ఉన్నారు. జియ్మమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, మండల అధ్యక్షులు పల్లా రాంబాబు, పెద్ద బుడ్డిడి గ్రామంలో తెలుగు రైతు అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి, ఇటిక గ్రామంలో టిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్‌టి సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమాలు చేపట్టారు. వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని టిడిపి ఎస్‌టి సెల్‌ అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు అన్నారు. జియ్యమ్మవలస మండలం ఇటిక గ్రామంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు అరెస్టుపై ప్రజలకు వివరించారు.

గుమ్మలకీëపురం.. సైకో పోవాలని రాసిన కాగితాలు తగలడుతున్న తోయక జగదీశ్వరి
గుమ్మలకీëపురం.. సైకో పోవాలని రాసిన కాగితాలు తగలడుతున్న తోయక జగదీశ్వరి

గరుగుబిల్లి : మండలంలో ఉల్లిభద్ర గ్రామంలో టిడిపి ఆధ్వర్యాన జగనాసుర దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. సైకో పోవాలి అనే పోస్టర్లను దహనం చేసి, నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మరడాన తవిటినాయుడు, ఎం.నారాయణస్వామి పాల్గొన్నారు.
కురుపాం : చంద్రబాబు అరెస్ట్‌ అన్యాయమని టిడిపి మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌ అన్నారు. కురుపాంలోని టిడిపి కార్యాలయం వద్ద 'దేశం చేస్తోంది రావణాసుర దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం' అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కిమిడి రామరాజు, టిడిపి నాయకులు విశ్వనాథ్‌, బోటు గౌరీ, ఆకుల రమేష్‌, కర్రి శ్రీను, బి.రామక్రిష్ణ, కొట్టు రమణ, ప్రశాంత్‌, చంటి, వెంకటరమణ, కలిశెట్టి శ్రీను, త్రినాథ, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.