ప్రజాశక్తి - సామర్లకోట రూరల్, ఏలేశ్వరం రైతు సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసింది శూన్యం అని పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట ఎడిబి రోడ్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవి చంద్ర ప్రసాద్ పంట పొలాల్లో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఏరువాక పౌర్ణమి సందర్భగా పంట పొలాల్లో దుక్కు దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆడబాల కుమార స్వామి, బడుగు శ్రీకాంత్, పాలకుర్తి శ్రీనివాసా చార్యులు, కంటే జగదీష్ మోహన్ (బాబు), ఫైన్ని శ్రీనివాసరావు పాల్గొన్నారు. టిడిపితోనే రైతులకు భరోసా లభిస్తుందని పార్టీ ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ రాజా అన్నారు. ఏరుపాక పౌర్ణమి సందర్భంగా ఆమె రైతులతో కలిసి అరక పట్టి పొలం దున్ని ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు.










