Jun 04,2023 23:36

పూజ చేస్తున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

ప్రజాశక్తి - రంపచోడవరం
ఈ ఏడాది వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ఆదివారం మండలంలోని తాటివాడ గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టిడిపి సీనియర్‌ నాయకులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు రమేష్‌ తదితరులు నాగలితో దుక్కి దున్ని ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎక్కువగా న్యాయం చేసేది టిడిపియేనని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా రైతన్నలకు రూ.20 వేలు వారి ఖాతల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెంటపాటి అనంత మోహన్‌, కారం సింహాచలం, సిద్ధ వెంకన్న దొర, కుంజం బాపన్న దొర, కొమరం బాబి, బొరగా గంగరాజు, వసంతకుమారి, సిరిసం అబ్బులు, బొరగా సోమరాజు, కారం బాపిరాజు, సిరిసం సూర్యనారాయణ దొర, కారం అబ్బాయి దొర, కోటం వెంకటేశ్వర్లు దొర, బాబ్జి, బుచ్చిరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాడేరు టౌన్‌ : రైతు భరోసా కేంద్రాల పేరిట వైసిపి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు కుమ్మరిపుట్టు పొలంలో ఆదివారం ఏరువాక కార్యక్రమాన్ని పాడేరు నియోజవర్గ టిడిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, నియోజకవర్గ పరిశీలకులు రాజమండ్రి నారాయణతో కలసి పొలంలో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం టిడిపితోనే సాధ్యమన్నారు. మహానాడులో రైతులకు ఆర్థికపరమైన భరోసాను ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా కింద నాలుగేళ్లలో రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.