ప్రజాశక్తి-అనకాపల్లి
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసిపి మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిపిస్తామని మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ అన్నారు. జివిఎంసి 83వ వార్డు ఇన్చార్జి బొద్ధపు ప్రసాద్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో భీముని గుమ్మంలో శుక్రవారం జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, ఎస్సీ కార్పొరేషనుకు నిధులు లేకుండా చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోలవరపు త్రినాథ్, పోతల శ్రీనివాసరావు, దొడ్డి రాము పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : అధిక ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచే పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని తెలుగు రైతు జిల్లా కార్యదర్శి మల్ల వరాహ నర్సింగరావు అన్నారు. మండలంలోని వాడ్రాపల్లి గ్రామంలో శుక్రవారం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాండ్రేగుల నూక అప్పారావు, మల్ల శేషు, ఒంపోలు సీతప్పారావు, మల్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : జగన్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రం అధోగత పాలైందని టిడిపి చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల తాతయ్య బాబు అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం శుక్రవారం బుచ్చయ్యపేట, నీలకంఠాపురం గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోకవాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, ముచ్చకర్ల తాతీలు, సాయం శేషు సిరిగిరి శెట్టి శ్రీరామ్మూర్తి గణపతిరాజు బాబు పాల్గొన్నారు.










