
మాట్లాడుతున్న టిడిపి నాయకులు దినేష్‌రెడ్డి
టిడిపి అధికారంలోకి రావడం ఖాయం
అవినీతి సొమ్ము కక్కిస్తా
ప్రజాశక్తి-విడవలూరు:రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఎలగాలమ్మగుంట, అరుంధతివాడ, ఇందిరమ్మ కాలనీ ముసలారెడ్డి గుంట, పటేల్ నగర్ ప్రాంతాలలో పర్యటించారు. మహిళలు బ్రహ్మరథం పట్టి మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని టిడిపి అధికారంలోకి వస్తే రానున్న సంక్షేమ పథకాలు అభివద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో తనను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రతి అడుగు ప్రజల కోసం ప్రారంభించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేకును కత్తిరించి నాయకులతో కలిసి సంబరాలను నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 50 రోజుల్లో 30 గ్రామాలలో 25,700 కుటుంబాలను కలిశాను రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కలసి వారి సమస్యలు తెలుసుకుంటానన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల పూర్తిగా వస్తున్నా అభివద్ధి లేదన్నారు. గ్రామస్థాయి నుంచి వైకాపా అవినీతికి పాల్పడ్డ ప్రతి రూపాయిని కక్కిస్తానన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. వైకాపా చేస్తున్న మాఫియాలను అరికడుతామన్నారు. ఇన్ని రోజులు సహకరించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కష్ణ చైతన్య, మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, మాతూరు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు ఇమామ్ బాషా, తాటిపర్తి సుధాకర్, మేకల శేషయ్య, సమాధి శ్రీనివాసులు, దూది విజయ రాఘవన్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.