Nov 16,2023 23:38

ప్రజాశక్తి - బాపట్ల
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నానని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవరమ్మ అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇంటింటికి టిడిపి, మీ మాటే - నా బాట, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 4వ వార్డు రైలుపేట పొట్టి శ్రీరాములు పార్క్ వద్ద నుండి నాయకులతో కలసి టిడిపి విధి, విధానాలు వివరిస్తూ పర్యటించారు. మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తమ గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేశారు. పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని అన్నారు. మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు. దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైలుపేటలో ఎక్కడ చూసినా  చెత్త పేరుకొని పోయిందని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో చెత్తపై పన్నులు కట్టించుకుంటూ  చెత్తను మాత్రం తొలగించటం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పరిశా రమేష్ గౌడ్, ఫరీద్ మస్తాన్, తాతా చినబాబు, రాహుల్, సోమశేఖర్, బాలశంకర్, మానం శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, శివన్నారాయణ, శ్రీకాంత్, మారుతి ప్రసాద్, మొహనరావు, మెట్ల శ్రీనివాసరావు, ఉప్పాల కృష్ణ గౌడ్, షేక్ షాకా, గొర్ల గోపి, భావన్నారాయణ పాల్గొన్నారు.