Aug 11,2023 21:52

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

కురుపాం: కురుపాం నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా హ్యాట్రిక్‌ కొడతామని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. శుక్రవారం చినమేరంగిలో తన అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి కార్యక్రమంలో చేసిన ఆరోపణలు ఆర్గనైజర్లు ఇచ్చిన తప్పుడు సమచారంతో డీఆర్‌ను తీయించామని, అలాగే భూమి టిడిపి కార్యకర్తదని, ప్రభుత్వ భూమి అని చెప్పినటువంటి ఈ రెండు కూడా తప్పుడు ఆరోపణలని అన్నారు. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి పనులు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని, అవే మా గెలుపునకు శ్రీరామరక్ష అన్నారు. మా నాయుకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలే మా ధైర్యం నమ్మకంమని టిడిపి అభ్యర్థి ఎవరైనా వైసిపికి ఇక్కడ హ్యాట్రిక్‌ తప్పదని అన్నారు. 2019 లో వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ సాధిస్తామని అన్నారు. విలేకరుల సమావేవంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ మరిశర్ల బాపూజీ నాయుడు, ఎంపిపి శెట్టి పద్మావతి, జియ్యమ్మ వలస జడ్పీటీసీ ఎం.శశికళ , వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.