వినుకొండ: నంద్యాల నుండి రాజమహేంద్రవరం వరకు పాదయాత్రగా వెళుతున్న తెలుగుదేశం పార్టీ వీరాభిమాని కార్యకర్త చింతల నారా యణపై విఠంరాజుపల్లి వద్ద వైసిపి గుండాలు దాడి చేసి గాయపర చడం అమానుషమని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమ ర్శించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను ఆయన పరామర్శించి, దాడి వివరాలను అడిగి తెలుసు కున్నారు. 'బాబుతో నేను సైతం' బ్యానర్‌ను చేత పూని పాదయాత్రగా వెళుతున్న తనను విఠంరాజు పల్లి వద్ద నలు గురు దుండగులు రెండు బైకులు పై వచ్చి అడు కున్నారని, దుర్భాషలాడుతూ దాడి చేసి గాయ పరిచారని బాధితుడు నారాయణ తెలిపారు. జీవి ఆంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరికి సంఘీభావంగా తెలిపేందుకు పాదయాత్రగా వెళుతున్న నారాయణపై దాడి చేసిన రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










