ప్రజాశక్తి - పోలవరం
పోలవరం గ్రామపంచాయతీ పరిధిలో ఎడ్లగూడెం గ్రామంలో టిబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు వాలీబాల్ కిట్లను యువతకు వైసిపి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం వైసిపి యువ నాయకులు పొడుం శ్యామ్ కుమార్, ఈదేపల్లి వెంకట గణేష్, పోలవరం సచివాలయ కన్వీనర్ మాదేపల్లి సాయి రామకృష్ణ పాల్గొన్నారు.










