May 24,2023 19:16

అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న నర్సింగ్‌ విద్యార్థులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఏరియా ఆస్పత్రి నుంచి భీమాస్‌ సర్కిల్‌ వరకు టిబి సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం నేషనల్‌ నర్సింగ్‌ స్కూలు, నోబుల్‌ ఒకేషనల్‌ కళాశాల విద్యార్థులు ఫ్లకార్డులు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం టిబి వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఒటిసి డాక్టర్‌ షేకూన్‌ భాను, ఎంపిహెచ్‌ఎస్‌ బాబు రాజు మాట్లాడారు. రెండు వారాలపాటు దగ్గు ఉంటే టిబిగా అనుమానించాలన్నారు. టిబి ఉన్న వ్యక్తికి ఉదయం, సాయంత్రం జ్వరం వస్తూ ఉంటుందన్నారు. నేషనల్‌ నర్సింగ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ నీలోఫర్‌, ఎంపిహెచ్‌ఎస్‌ లలితమ్మ, టిబిహెచ్‌వి సుబ్బమ్మ బాయి పాల్గొన్నారు.