సూచనలు చేస్తున్న డాక్టర్
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని శంకర్ నగర్ మ్యాక్ సెంటర్‌లో సచివాలయం ఎఎన్‌ఎంలు, ఆశాలకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షిక, ఎంపిహెచ్‌ఎస్ బాబురాజు ఆధ్వర్యంలో మంగళవారం టిబి వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిబి రోగులను పరీక్షించి వారికి మ్యాక్ సెంటర్ నుంచే మందులు ఇస్తారన్నారు. రెండు వారాలపాటు దగ్గు ఉన్నట్లయితే టిబిగా అనుమానించాలని తెలిపారు. టిబి ఉన్న వ్యక్తికి ఉదయం, సాయంత్రం జ్వరం వస్తూ ఉంటుందన్నారు. బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడం, రక్తపు ఛారలతో కూడిన గళ్ల పడడం తదితర లక్షణాలున్న వారు ఉదయం తీసిన గళ్లను తీసుకొస్తే నిర్ధారణ కోసం పరీక్షకు పంపుతామని తెలిపారు.










