Oct 19,2023 19:43

రోగులకు కిట్లు పంపిణీ చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి - ఆదోని
ప్రధాన మంత్రి టిబి ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా 34 మంది టిబి రోగులకు ఆదోనిలోని టిబి కేంద్రంలో గురువారం పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఐఎంఎ, లయన్స్‌ క్లబ్‌ సంయుక్తంగా సమతుల్య ఆహారం కిట్లను అందించినట్లు ఐఎంఎ సెంట్రల్‌ వర్కంగ్‌ కమిటీ మెంబర్‌ డాక్టర్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ కృష్ణమూర్తి, టిబి ఆఫీసర్‌ డాక్టర్‌ షేకూన్‌ భాను తెలిపారు. దేశాన్ని టిబి రహితంగా చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ ఛైర్మన్‌ ప్రసాద రావు, అధ్యక్షులు ధర్మారెడ్డి, ఈసీ మెంబర్‌ ఓం ప్రకాష్‌, టిబి స్టాఫ్‌ బాబు రాజు, స్వరూప్‌ పాల్గొన్నారు.