Aug 23,2023 20:35

కిట్లను పంపిణీ చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టిబి ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదోని శ్రీనివాస కల్యాణ మండపంలో 33 మంది టిబి రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడుతూ... ప్రతి టిబి రోగికీ ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఉషా రావు, స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్లు డాక్టర్‌ కృష్ణమూర్తి, డాక్టర్‌ హరీష్‌, ఆదోని టిబి ఆఫీసర్‌ డాక్టర్‌ షేకున్‌ భాను, ఏడిమ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ రఘురామి రెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ధర్మారెడ్డి, రీజియన్‌ ఛైర్మన్‌ ప్రసాదరావు, కోశాధికారి శంకరమ్మ, ఈసీ మెంబర్లు కెజి.మూర్తి, మల్లికార్జున గౌడ్‌, టిబి డిపార్ట్‌మెంట్‌ బాబు రాజు, సూపర్‌వైజర్లు ఉమాపతి, కోఆర్డినేటర్‌ వీరేష్‌, స్వరూప్‌, మనోరంజని, సుబ్బమ్మబాయి, లలిత బాయి, కల్యాణ మండపం మేనేజర్‌ ఈరన్న పాల్గొన్నారు.