Jun 23,2023 19:13

కిట్లను పంపిణీ చేస్తున్న డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యవతి

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని టిబి కేంద్రంలో ప్రధాన మంత్రి ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా శుక్రవారం 8 మంది టిబి రోగులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ సత్యవతి మాట్లాడారు. టిబి, డిఎంహెచ్‌ఒ సిబ్బంది కలిసి రూ.1000 విలువ చేసే మూడో విడత సమతుల్య ఆహార కిట్లను అందించామన్నారు. దేశాన్ని టిబి రహితంగా మార్చేందుకు దాతలు ముందుకొచ్చి టిబి రోగులను దత్తత తీసుకోవాలని కోరారు. ఎంఒటిసి షేకూన్‌ భాను, ఎంపిహెచ్‌ఎస్‌ బాబురాజు, ఎంపిహెచ్‌ఎస్‌ ఇందిరా దోరతి, టిబిహెచ్‌విలు లలితమ్మ, సుబ్బమ్మ బాయి, ఎస్‌టిఎస్‌ స్వరూప్‌రాజ్‌ కుమార్‌, రేడియో గ్రాఫర్‌ శ్రీనివాసులు, ఎల్‌టి పద్మావతి, ఎల్‌ఎ రవి ప్రకాష్‌ పాల్గొన్నారు.