కిట్లు పంపిణీ చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి - ఆదోని
ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 10 మంది టిబి రోగులకు ఆదోనిలోని టిబి కేంద్రంలో సోమవారం పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఎంఒటిసి షేకున్ బాను, ఎంపిహెచ్‌ఎస్ బాబురాజు మాట్లాడుతూ... భీమాస్ రెసిడెన్షి డైరెక్టర్ విట్టా రమేష్ రూ.వెయ్యి విలువ చేసే సమతుల్య ఆహారం కిట్లను అందించారని తెలిపారు. దేశాన్ని టిబి రహితంగా మార్చేందుకు దాతలు ముందుకొచ్చి టిబి రోగులను దత్తత తీసుకోవాలని కోరారు. ఎంపిహెచ్‌ఎఫ్ లలితమ్మ, టిబిహెచ్‌వి సుబ్బమ్మ బాయి, టిబి క్లినిక్ స్టాఫ్ పాల్గొన్నారు.










