Sep 11,2023 20:39

ఫొటో : తహశీల్దారును సన్మానిస్తున్న వైసిపి నాయకులు

తహశీల్దారుకు సన్మానం
ప్రజాశక్తి-సీతారామపురం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్‌ ఎం వి కే సుధాకర్‌ రావును వైసిపి రాష్ట్ర పంచాయతీరాజ్‌ వింగ్‌ కార్యదర్శి, రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పిసి అల్లూరు రాజు, వైసిపి సీనియర్‌ నాయకుడు పాలకొలను వెంకటరామిరెడ్డితో కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీల్లోని రైతులు, ప్రజలు పలు రకాల భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు.
అదేవిధంగా అన్ని అర్హతలు ఉండి ఇంటి స్థలం లేని వారు ఇంకా ఉన్నారని వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చొరవ చూపాలన్నారు.