ప్రజాశక్తి - మార్టూరు రూరల్
నూతన తహశీల్దారుగా కె సుజాత గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల కలెక్టరేట్‌లో ల్యాండ్ సెక్షన్ సూపర్నెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె సాధారణ బదిలీల్లో భాగంగా మార్టూరు తహశీల్దారుగా వచ్చారు. ఇప్పటివరకు తహశీల్దారుగా పనిచేసిన పొన్నగంటి సురేష్ బాబు బాపట్ల కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నూతన తహశీల్దారు కె సుజాత తెలిపారు.










