Jul 22,2023 23:12

తహశీల్ధార్‌ ప్రభాకర్‌రావును సన్మానిస్తున్న నాయకులు


ప్రజాశక్తి చీరాల
జగనన్న సురక్ష కార్యమ్రంలో భాగంగా రెవెన్యూ సేవలు అందించడంలో మండల పరిధిలోని కావూరిపాలెం పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కావూరి రమణారెడ్డి తెలిపారు. జగనన్న కార్యక్రమంలో భాగంగా కావూరి వారిపాలెంలో 8,200 సర్వీసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. దీంతో కావూరిపాలెం పంచాయతీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. తమ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేందకు చీరాల తహశీల్దారు ప్రభాకర్‌ రావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల కృషే కారణమని తెలిపారు. అందులో భాగంగా తహశీల్దారు ప్రభాకర్‌రావును శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీరాల గ్రామ వైసిపి నాయకులు పిట్టు నాగిరెడ్డి, మేడిపోయిన రత్నారెడ్డి, కావూరి యదలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.