Jul 17,2023 02:00
తహశీల్దారు ప్రభాకర్‌రావును సన్మానిస్తున్న రాష్ట్ర ఐక్యవేదిక సభ్యులు

ప్రజాశక్తి-చీరాల: రెవెన్యూ సేవలను ప్రజలకు సకాలంలో అందిస్తూ అందరికీ సుపరిచతులుగా మంచి పేరు తెచ్చుకున్న తహశీల్దారు జీవిగుంట ప్రభాకర్‌రావు చీరాల తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్‌ మైనారిటీస్‌ ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదివారం చీరాలలోని ఆయన ఛాంబర్‌లో కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్‌బాబు మాట్లాడుతూ తహశీల్దారు ప్రభాకరరావు ఎక్కడ పనిచేసినా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ, అందరివాడిగా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అలానే చీరాలలో కూడా ఈ సంవత్సర కాలంలో అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, అధికారుల మన్ననలు పొంది వారి అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. ఇలాంటి అధికారి చీరాల మండల ప్రజలకు దొరకటం అదృష్టంగా భావిస్తున్నారని, ఆయన ఇంకా ఎక్కువ కాలం చీరాల ప్రజలకు సేవలు అందించాలని, మంచి పేరుతో కొనసాగుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్యవేదిక సభ్యులు జగన్నాథం యోహాన్‌, కొమ్మాలపాటి బుజ్జిబాబు, బండారు చంటిబాబు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.