తహశీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడులు
ప్రజాశక్తి- రేణిగుంట : రేణిగుంట తహశీల్దారు కార్యాలయంపై ఎసిబి ఏఎస్పి దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రేణిగుంట తహశీల్దారు కార్యాలయానికి ఏసీబీ ఏఎస్పీ దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం చేరుకున్నారు. ఏసీబీ అధికారులు రికార్డులు పరిశీలించారు. కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ స్పందన ఫిర్యాదుల మేరకు తహశీల్దారు కార్యాలయంపై దాడులు నిర్వహించామన్నారు. తహశీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజల నుండి రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. రికార్డులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తహశీల్దారు కార్యాలయం అధికారుల దగ్గర లెక్కల్లో, ఉన్న లెక్కల్లో లేని 1,65,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నామని మరికొన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు తమిళ్ అహ్మద్, మహమ్మద్, ఈశ్వర్ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.










