Sep 04,2023 23:07

ప్రజాశక్తి-యంత్రాంగం కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం చేపట్టిన సమరభేరిలో భాగంగా సోమవారం తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. అనంతరం తహశీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి, నగర నాయకులు కె.సత్తిరాజు, ప్రసాద్‌, చంద్రమళ్ల పద్మ, రామలక్ష్మి, సత్తిబాబు మాట్లాడారు. అనంతరం 1000 సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అర్బన్‌ తహశీల్దార్‌ వరహాలయ్యకు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నాయకులు మలకా వెంకటరమణ, వేణు, సూరిబాబు, ఏసూరి శ్రీనివాస్‌, సిహెచ్‌.విజరు కుమార్‌, శేషు, రమేష్‌, కుమారి, రమణమ్మ, సూర్యారావు, రవి, దుర్గా ప్రసాద్‌, శ్రీకాంత్‌, రాణి పాల్గొన్నారు. కోటనందూరులో సిఐటియు కార్యదర్శి ఎస్‌కె.పద్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు కార్యదర్శి అప్పారావు, బాబ్జి, అప్పలనర్స, గౌరితల్లి, లక్ష్మి, సత్యవతి వరలక్ష్మి, పార్వతి పాల్గొన్నారు. యు.కొత్తపల్లి సిపిఎం నాయకులు జి.అప్పారెడ్డి తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కె.నాగేశ్వరరావు, సిహెచ్‌.పద్మాకర్‌ రావు, వి.గంగాధర్‌, ఎం.లోవరాజు, పి.విజయకుమార్‌ పాల్గొన్నారు. ఏలేశ్వరంలో సిపిఎం నాయకుడు చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడారు. సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు, మాసా రామారావు శీలి బాలరాజు, ఎం.రాంబాబు, కొల్లి చిన్నారి, పోలమాటి పద్మలత, ఆరుగుళ్ల బాలాత్రిపుర సుందరి, కాకాడ నాగరత్నం, జల్లు అప్పలరాజు, వేమగిరి దొంగబాబు, రౌతు సత్యనారాయణ ఉన్నారు. తాళ్లరేవులో ధర్నానుద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారానికి వచ్చింది మొదలు ఇప్పటివరకు నిత్యవసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయన్నారు. ఈ ధర్నాకు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఉంగరాల వెంకటేశ్వరరావు, దళిత నాయకులు వాకపల్లి చిరంజీవి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో వల్లు రాజబాబు, దుప్పి అదృష్టదీపుడు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, మందనక్క తణుకురాజు, పలివెల సింహాచలం, పాలెపు ఈశ్వరరావు, చొల్లంగి వెంకటలక్ష్మి, నేల అన్నవరం, మురమళ్ల శ్రీను పాల్గొన్నారు. పెద్దాపురంలో ధర్నా అనంతరం తహశీల్దారు జితేంద్రకు వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్‌, కేదారి నాగు, మాగాపు నాగు, దారపురెడ్డి కృష్ణ, ఆర్‌.వీర్రాజు, యాసలపు రమేష్‌, కె.అప్పన్న, సుబ్బలక్ష్మి, హనుమంతు, సిరపరపు మరిడియ్య, గూనూరు వెంకటరమణ, తైనాల శ్రీను, వడ్డి సత్యనారాయణ, డి.సత్యనారాయణ, దారపురెడ్డి క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాద్‌రావు మాట్లాడారు. నాయకులు కరణం గోవిందరాజు, పి.వీరబాబు, డి.శ్రీను, చల్లా మహేష్‌, బి.శ్రీను, కత్తెరి వెంకటేష్‌ పాల్గొన్నారు. పిఠాపురంలో సిపిఎం నాయకులు కుంచే చిన్న, కోనేటి రాజు మాట్లాడారు. కె.నాగేశ్వరరావు, కె.మణి, జి.వీరబాబు, గోపాలకృష్ణ, కె.నాగలక్ష్మి, పి.చంటి, జి.అప్పారావు, గోవిందాచారి, సూర్యనారాయణ, పొట్లూరి రామకృష్ణ, వి.నాగు పాల్గొన్నారు.