Sep 07,2023 19:25

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
తహశీల్దార్‌కు వినతి
ప్రజాశక్తి-సంగం:స్థానిక పిఎసిఎస్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన సంఘటనపై టీడీపీ నాయకులు తహశీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.పిఎసిఎస్‌ కార్యాలయం లో అనధికారిక సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లు,అధికారులను సస్పెండ్‌ చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌ మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి పిఎసిఎస్‌ కార్యాలయం లో అనధికారికంగా అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు.నిన్నటి రోజున తమ నాయకులు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పిఎసిఎస్‌ కార్యాల యంలో జరుగుతున్న వాలంటీర్ల సమావేశాన్ని అడ్డుకొని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్‌ బాబు, నియోజకవర్గ మహిళా నాయకురాలు మంజుల నాయుడు, కాకు వెంకటేశ్వర్లు, విజయ కష్ణా రెడ్డి, శ్రీనివాసులు, శ్రీధర్‌, శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు.