Aug 26,2023 00:01

 రాజుపాలెం: మండల తహశీల్దార్‌గా అష్రా ఫున్నీషా బేగం శుక్రవారం బాధ్య తలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలు, కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేసి మండలాన్ని అభివృద్ధిలో నడిపిస్తానన్నారు. అనంతరం విఆర్‌ఒలు, విఆర్‌ఎ రెవెన్యూ సిబ్బందితో సమా వేశమయ్యారు. సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవ హరిస్తూ ప్రజలకు అందు బాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.