నకరికల్లు: పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ నకరికల్లు తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వ హించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరి శీలించారు. ముందుగా 2022 1 జూన్ నుండి ఇప్పటి వరకు వరకు తొలగించిన ఓట్ల వివరాలు, జీరో డోర్ నెం బర్లు, ఒకే డోర్ నెంబర్‌లో పది మంది కంటే ఎక్కువ నమోదైన ఓట్ల వివరాలు, వందేళ్లు పైబడిన ఓటర్ లిస్ట్ లో నమోదైన వారి వివరాలకు సంబంధించిన నివేదికలను పరి శీలించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల నియమావళి ప్రకారం వచ్చిన సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అలాగే,బిఎల్వోల నివేదిక, ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా పర్యవేక్షించి పెండింగ్ నివేదికలను త్వరతగతిన పూర్తి చేయాలని తహశీల్దార్ నగేష్‌ను ఆదేశించారు.










