చేబ్రోలు : తహశీల్దార్ కార్యాలయం అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్, ఎమ్మెల్సి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొని శంకుస్థాపన చేశారు. కారక్రమంలో తహశీల్దార్ కార్యాలయ అదనపు గదుల నిర్మాణ దాతలు పి.సత్యనారాయణను ఎమ్మెల్సి, ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మండల ప్రజలు తహశీల్దార్ కార్యా లయం సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సిబ్బంది వసతి సౌకర్యార్యార్థం అదనపు గదుల నిర్మాణం కోసం తహశీల్దార్ మంచి ప్రయత్నం చేశారని అన్నారు. తహశీల్దార్ కార్యా లయం సిబ్బంది అందరూ సమన్వంతో కలసి సమర్థవంతంగా రైతులు ప్రజ లకు ఉపయోగార్థం పనిచేయాలని సూచించారు. తహశీల్దార్ మాట్లాడుతూ కార్యాలయం సిబ్బంది విధుల నిర్వహణకు తగిన వసతి గదులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో అదనపు గదుల నిర్మాణం కోసం అడిగిన వెంటనే దాత పరిమి సత్యనారాయణ ,పద్మా వాసిని అదనపు గదుల పూర్తి నిర్మాణం ఖర్చులు ఇస్తామని అంగీకరించడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.బాబురావు, చేబ్రోలు వైద్యాధికారి అబ్రహం లింకన్, చేబ్రోలు సర్పంచ్ పి.వినితా రాణి, పంచాయతి కార్యదర్శి శ్రీనివాసరావు,ఎంపిడిఒ, తహశీల్దార్ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.










