తహశీల్దార్ సుధాకర్
తహశీల్దార్ బాధ్యతలు స్వీకరణ
ప్రజాశక్తి-సీతారామపురం:తహశీల్దార్ గా ఎం వి కె సుధాకర్ రావు గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.ఈయన లింగసముద్రం తహశీల్ధార్ గా విధులు నిర్వహిస్తూ సీతారామపురం తహశీల్దార్ గా బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు డిప్యూటీ తహశీల్దార్ షేక్ షాజియా బేగం ఇన్చార్జి తహశీల్దార్ గా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం తహశీల్దార్ సుధాకర్ రావు మాట్లాడుతూ మండల అభివద్ధికి కృషిచేస్తామన్నారు. ఎప్పటినుంచో పేరుకుపోయిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కషి చేస్తూ ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతీ పథకాన్ని ప్రజలకు అందించేలా తనవంతు కషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయనను మారం రెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ రామి శెట్టి తిరుపతయ్య, డైరెక్టర్ తిరుపాలు, డిప్యూటీ తహశీల్దార్ షాజియాబేగం, వ్యవసాయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.










