ప్రజలకు సూచనలు చేసిన ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు
ప్రజాశక్తి - ఆరిలోవ : దీపావళి పండగను అందరూ సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని కార్నియా వైద్య నిపుణులు డాక్టర్ శిల్పా తరణి, రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ భావిక్ పాంచల్, కార్నియా యాంటీరియల్ సెగ్మెంట్ కన్సల్టెంట్ డాక్ఱర్ ముగుందన్ రాజరాజన్ సూచించారు. శుక్రవారం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో దీపావళి పండగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
దీపావళి టపాసులను పెద్దల సమక్షంలోనే పిల్లలు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెలుగుల దీపావళి నిర్వహణలో అజాగ్రత్త వల్ల ఏటా అనేకమంది కంటిచూపును కోల్పోతున్నారన్నారు.తగు జాగ్రత్తలతో పండుగను జరుపుకుంటే దీపావళి ఆనందమయమౌతుందన్నారు. గతేడాది దీపావళికి గాయపడి, గాయపడిన పదేళ్ల బాలుడికి రెండుకళ్లను కంటిచూపును తిరిగి రప్పించామన్నారు.
టపాకాయలను పిల్లలకు అందకుండా అట్ట డబ్బాల్లో, గ్యాస్ సిలెండర్, నూనె డబ్బావంటి మండే పదార్ధాలకు దూరంగా భద్రపరుచుకోవాలన్నారు. టపాకాయలను బహిరంగ ప్రదేశంలో, రక్షక అద్దాలను ఉపయోగించి కాల్చడం మంచిదన్నారు. పేలుడు టపాసులను సీసా, రేకు డబ్బా, బోర్లించిన కుండ వంటి పాత్రలో వెలిగించడం ప్రమాదకరమని గ్రహించాలి. ఏదైనా గాయమైతే, దానిపై నీళ్లుపోసి ఎక్కువ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.










