Aug 03,2023 19:42

దేవనకొండలో కిట్లు పంపిణీ చేస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని తెర్నేకల్‌ గ్రామ అంగన్వాడీ-1లో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లను సర్పంచి అరుణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం గర్భిణులకు, బాలింతలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మంచి పోషకాలు గల ఆహారం ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఒక కిట్టులో 3 కిలోల బియ్యం, కిలో బ్యాళ్లు, 2 కిలోల రాగి పిండి, కిలో అటుకులు, పావు కిలో బెల్లం, పావు కిలో ఎండు ఖర్జూర, చిక్కీలు, గుడ్లు 25, పాలు 5 లీటర్లు ఉంటాయని తెలపారు. పోషకాహారం తీసుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలన్నారు. ఉప సర్పంచి సులోచనమ్మ భర్త బెల్‌ ఈరన్న, ఎంపిటిసి నామాల శ్రీను, సచివాలయం కన్వీనర్‌ చాప ఈరన్న, అంగన్వాడీ టీచర్స్‌ మొగతాల్‌ నిరీక్షణ, లక్ష్మి, చిట్టి, రూతమ్మ, సజీవమ్మ, మంజుల, లలితమ్మ పాల్గొన్నారు. మంత్రాలయం పంచాయతీ కార్యాలయంలో సర్పంచి భీమయ్య కిట్లు పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గోడపత్రికలను విడుదల చేశారు. ఇఒ నాగరాజు, సచివాలయ పంచాయతీ కార్యదర్శి మధుశ్రీ, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, ఉప సర్పంచి హోటల్‌ పరమేష్‌, సచివాలయ కో కన్వీనర్‌ వికెసి.రాఘవేంద్ర ఆచారి, నాయకులు గోరుకల్లు కృష్ణ స్వామి, జనార్ధన్‌ రెడ్డి, శివకుమార్‌, సిహెచ్‌ఒలు పీరా నాయక్‌, రేష్మ, జయంతి, మహిళా పోలీసు చంద్రకళ, అంగన్వాడీ టీచర్లు స్వప్న, కల్యాణి, ప్రమీలమ్మ, భీమేశ్వరి, శ్వేత పాల్గొన్నారు.

మంత్రాలయంలో కిట్లు పంపిణీ చేస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌
​​మంత్రాలయంలో కిట్లు పంపిణీ చేస్తున్న సర్పంచి అరుణ్‌ కుమార్‌