
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
2022-23 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల విద్యార్థులు తమ సత్తా సాటారు. మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను 5వ స్థానంలో నిలబెట్టారు.
అనకాపల్లి : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా పరిషత్, జీవీఎంసీ ఉన్నత పాఠశాలలకు చెందిన బాలికలు అత్యధిక మార్కులు సాధించారు. జీవీఎంసీ పరిధిలో 6 పాఠశాలల నుండి 450 మంది పరీక్షలు రాయగా, 326 మంది ఉత్తీర్ణులయ్యారు. పట్టణ బాలికల పాఠశాలకు చెందిన దోసూరు హన్సిత 587 మార్కులతో పట్టణ టాపర్‌గా నిలిచారు. గాంధీనగరం పాఠశాలకు చెందిన సిహెచ్.రేణుక అమృత 582, మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఎస్.పవన్‌రాజ్ 553, గవరపాలెం బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన దొడ్డి లహరి 546, భీముని గుమ్మం అంబేద్కర్ స్కూల్‌కి చెందిన పి.గాయత్రీ లక్ష్మి 449 మార్కులు సాధించారు. 11 జెడ్‌పి పాఠశాలల నుండి 775 మంది విద్యార్థులకు గాను 551 మంది ఉత్తీర్ణులయ్యారు. సీతానగరం పాఠశాలకు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ జాహ్నవి 580 మార్కులతో మండల టాపరుగా నిలిచింది. తుమ్మపాల పిఎంవి ప్రణీత 559, దిబ్బపాలెం ఎస్.యోగేంద్ర 559, మామిడిపాలెం సురభి యామిని 550, కె.కొప్పాక బోయిడపు ప్రణీత్ 543, మార్టూరు పెద్దాడ లావణ్య 531, కూండ్రం సేనాపతి తరుణ్ 531, మర్రిపాలెం గొర్లి మౌనిక 526, కొండు పాలెం అక్కిరెడ్డి శృతి 519, చింత నిప్పుల అగ్రహారం ఎస్‌కె దూర్వాస 513, తారకరామ కాలనీ ఆర్ శిరీష 474 మార్కులు సాధించారు. ఎఎంఎఎ ఎయిడెడ్ పాఠశాలలో 179 మందికి 145 మంది ఉత్తీర్ణత సాధించారు. అల్లు భానుశ్రీ 547 మార్కులు సాధించారు. గురుకుల పాఠశాల నుంచి 59 మందికిగాను 57 మంది పాసయ్యారు. బి.జయదేవ్ 577 మార్కులు సాధించారు. స్థానిక నారాయణ విద్యా సంస్థల్లో చదివిన తుమ్మపాలకు చెందిన పంచదార్ల మహాలక్ష్మి 585 మార్కులు సాధించింది. ఆమె తండ్రి పంచదార్ల కన్నారావు తుమ్మపాల ఎంపీటీసీ సభ్యులుగా కొనసాగుతున్నారు.
సబ్బవరం : మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుండి 959 మంది పరీక్ష రాయగా, 814 మంది పాసై 84.88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్.అప్పలరాజు తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 572 మందికి 438 మంది, ప్రైవేట్ పాఠశాలలో 387 మందికి 376 మంది ఉత్తీర్ణత సాధించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 125 మందికి 92 మంది పాస్ కాగా, ఎ.దేవానంద స్వామి 559 మార్కులు, డి.లహరి 550 సాధించారు. గురుకులంలో 70 మందికి 60 మంది పాసయ్యారు. రావాడ ఈక్షిత్ 543 మార్కులు సాధించాడు. కెజిబివిలో 39 మందికి 32 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరిపాక జెడ్‌పి హైస్కూల్‌లో 107 మందికి 77 పాసయ్యారు. డి.పుష్పాంజలి 570, పి.వర్షిత 565, ఎన్.ఆంటోని 561 సాధించారు. రావలమ్మపాలెం జెడ్‌ప్ హైస్కూల్‌లో 78 మందికి 65 మంది, మల్లు నాయుడు పాలెం జెడ్‌పి హైస్కూల్‌లో 69 మంది 51 మంది, నంగినారపాడు జెడ్‌పి హైస్కూల్‌లో 99 మందికి 63 మంది, తవ్వవానిపాలెం జెడ్‌పి హైస్కూల్‌లో 20 మంది 14 మంది ఉత్తీర్ణత సాధించారు.
చోడవరం : చోడవరం జెడ్పీ బాలికల స్కూల్‌లో 89 మంది పరీక్షలు రాయగా, 72 మంది పాసయ్యారు. జుత్తాడలో 40 మందికి 36, గౌరీపట్నంలో 29 మందికి 22, నరసాపురం కేజీబీవిలో 41 మంది 34, పిఎస్‌పేట జెడ్పీహెచ్‌లో 56 మందికి 43, లక్కవరం జెడ్పీహెచ్‌లో 61మందికి 50, జన్నవరంలో 45 మందికి 37, గోవాడలో 96 మదికి 79, దుడ్డుపాలెంలో 26 మందికి 18, గవరవరంలో 41 మందికి 32, చోడవరం గురుకులంలో 36 మందికి 30, చోడవరం హైస్కూల్‌లో 92 మందికి 56, ముద్దుట్టిలో8 43 మందికి 38 మంది ఉత్తీర్ణులయ్యారు.
దేవరాపల్లి : మండలంలోని 11 ప్రభుత్వ, రెండు ప్రైవేటు పాఠశాలల నుండి 426 మంది పది పరీక్షలు రాయగా 411 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఇఒ సిహెచ్.రవీంద్రబాబు తెలిపారు. వేచలం జెడ్‌పిహెచ్‌కు చెందిన ఆర్.మౌళి 584 మార్కులు, తెనుగుపూడి గురుకులానికి చెందిన జి.మనోహర్ 578, దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన కె.సందీప్ 578, కెజిబివికి చెందిన ఎస్.వెంకటలక్ష్మి 565, ఎ.కొత్తపల్లి జెడ్‌పిహెచ్‌కు చెందిన గంటా షర్మిల 549 సాధించారు. ఎ.కొత్తపల్లిలో శతశాతం ఉత్తీర్ణత సాధించి, 500 పైబడిన మార్కులు ఐదుగురు తెచ్చుకున్నారని పాఠశాల హెచ్‌ఎం వై.స్వర్ణలత తెలిపారు.
బుచ్చయ్యపేట : మండలంలోని సీతయ్యపేట ఉన్నత పాఠశాలలో 105 మంది పరీక్షలు రాయగా, 84 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 53 మంది ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. కె.రాజులమ్మ 553 మార్కులు సాధించినట్లు హెచ్‌ఎం ఏవి.జగన్నాథరావు తెలిపారు. దిబిడి జెడ్‌పిహెచ్‌లో 134 మందికి 82 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో 40 ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. జి భవాని 540 సాధించినట్లు హెచ్‌ఎం బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. బుచ్చయ్యపేట జాజిమొగ్గలా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 22 మందికి 21 మంది ప్రథమ శ్రేణులో, ఒకరు ద్వితీయ శ్రేణిలో ఉత్తర్నత సాధించినట్లు ప్రిన్సిపాల్ జాజిమొగ్గలు శ్రీను తెలిపారు. ఈ పాఠశాలకు చెందిన సుంకర నవీన్ 568, మార్కులు, తూరుబిల్లి పూజిత 567 మార్కులు సాధించారని పేర్కొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని ఏడు జెడ్‌పిహెచ్, ఒక కెజిబివి, నాలుగు ప్రైవేటు పాఠశాలల్లో 522 మంది పరీక్షలు రాయగా, 489 మంది పాసై 93.68 శాతం ఉత్తీర్ణులైనట్లు ఎంఈఓ మధు మూర్తి తెలిపారు. వేణు విద్యానికేతన్, సూర్య బాసర పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, వేణు విద్యానికేతన్ విద్యార్థి గుంటుబోయిన వెంకటేష్ 573 మార్కులతో మండల టాపర్‌గా, పాతవలస, కొరువాడ జెడ్‌పిహెచ్‌లకు చెందిన పొంతపల్లి తిరుమల, జి.నాని 570 మార్కులతో ద్వితీయ స్థానం, చౌడువాడ పాఠశాలకు చెందిన ఆడారి కుసుమ 569 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
పరవాడ : మండలంలోని తానం గురుకుల పాఠశాలకు చెందిన ఆర్.నిక్సిత 586 మార్కులతో ప్రథమ స్థానం, పెదముషిడివాడ జెడ్‌పిహెచ్‌కు ఎస్.తేజస్విని 581 మార్కులతో ద్వితీయ స్థానం, లంకెలపాలెం జెడ్పీహెచ్ చెందిన జి గీత చరణ్ 574 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. మండలం మొత్తం 78.072 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ సునీత తెలిపారు.
కశింకోట : మండలంలోని త్యేగాడ కెజిబివి విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 78శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ డి చంద్రకళ తెలిపారు. 37 మంది పరీక్షలు రాయగా 29 మంది ఉత్తీర్ణత సాధించారని, ఎల్లపు ధరణి సంతోషి 536 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.
ప్రశాంతి నికేతన్ విజయ దుందుభి
అనకాపల్లి : అనకాపల్లి ప్రశాంతి నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. ఈ పాఠశాలకు చెందిన ఎం.శ్రీవల్లి 574 మార్కులు, డి.లోహిత్ 573, బి.శరత్ 572 మార్కులు సాధించారు. వీరితో పాటు 500 పైబడి మార్కులు సాధించిన 39 మందిని స్కూల్ కరస్పాండెంట్ డివి.శ్రీనివాసరావు, అగనంపూడి బ్రాంచ్ కరస్పాండెంట్ డి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ బి.వరాహ త్రివేణి అభినందించారు.