ప్రజాశక్తి- విలేకర్ల బృందం
2022-23 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.
ప్రజశక్తి- మోతుగూడెం
అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలోని డిఎవి పబ్లిక్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. మొత్తం 28 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 28 మంది పాసై, అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 579 మార్కులతో వేదక్షయ ప్రథమ స్థానం, 567తో సాయి కిరణ్, శంకర్ ద్వితీయ స్థానం, 566 మార్కులతో జోషిత్ ప్రేమ్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఎపి జెన్‌కో ఉన్నతాధికారులు డిఎవి పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. మోతుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 మందికి 10 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
జిల్లా టాపర్‌గా జాహ్నవి శ్రీనిధి
కూనవరం : మండలంలో 354 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా 197 మంది పాసై 56 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ నీలి బాలరాజు తెలిపారు. కూనవరం జెడ్‌పి పాఠశాలకు చెందిన పోసిన జాహ్నవి శ్రీనిధి 588 మార్కులు సాధించి అల్లూరి జిల్లా టాపరుగా నిలిచింది. స్థానిక జెడ్‌పిహెచ్‌లో 33 మందికి 20 మంది, మర్రిగూడెం జెడ్‌పిహెచ్‌లో 42 మందికి ఐదుగురు, నర్సింగపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో 68 మందికి 14, రేపాక బాలుర ఆశ్రమ పాఠశాలలో 21 మందికి 12, కెజిబివిలో 41 మందికి 23 మంది, కోతులగుట్ట ఎపిఆర్‌లో 87 మందికి 72 మంది, విక్టోరియా మాంటిసోరిలో 27 మందికి 21, విజయ సాధనలో 35 మందికి 30 మంది ఉత్తీర్ణులయ్యారు. విక్టోరియా మాంటిసోరి పబ్లిక్ స్కూల్ విద్యార్థి మధునై 576 మార్కులు సాధించి మండల ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా టాపర్‌గా నిలిచిన జాహ్నవి శ్రీనిధిని ఎంఈఓ బాలరాజు, హెచ్‌ఎం చిచ్చడి బాబురావు అభినందించారు.
డిఎవిలో 100 శాతం ఉత్తీర్ణత
సీలేరు : జీకే వీధి మండలం సీలేరు డిఎవి పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం రామచందర్రావు తెలిపారు. పాఠశాల నుంచి 19 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 19 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 600 మార్కులకు ఎ.గాయత్రి 551 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలవగా షేక్ యూసఫ్ 537తో ద్వితీయ స్థానం, జి.వంశీకృష్ణ 534తో తతీయ స్థానంలో నిలిచారు. శత శాతం ఉత్తీర్ణత వెనుక ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని అభినందించారు.
గురుకులంలో 87.3, జెడ్‌పి పాఠశాలలో 67.7 శాతం
సీలేరు ఎపి గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థులు 87.3 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. 63 మంది పరీక్షలు రాయిగా 55 మంది పాసయ్యారు. వల్లభనేని అనిల్ 480 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 31 మందికి 21 మంది పాసై, 67.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్‌ఎం రామన్న పడాల్ తెలిపారు. కిలో సాయికుమార్ 464 మార్కులతో ప్రథమ స్థానం, శ్రీకాకుళం హిమబిందు 459తో ద్వితీయ స్థానంలో నిలిచారు.
మండలంలో 99.7 శాతం ఉత్తీర్ణత
కొయ్యూరు : టెన్త్ ఫలితాల్లో కొయ్యూరు మండలం 99.7 శాతం ఉత్తీర్ణత సాధించింది. రెండు జెడ్‌పి, ఒక గురుకులం, ఒక కెజిబివి, 14 ఆశ్రమ పాఠశాలల నుండి 994 మంది పరీక్షలు రాయగా, 992 మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఇఒ బోడెంనాయుడు తెలిపారు. కొయ్యూరు జెడ్‌పి పాఠశాలకు చెందిన వి.బాల పద్మజ 550 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. ఎపి గురుకుల పాఠశాలకు చెందిన పవన్ కుమార్, రావణాపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన జి.దివ్య ఇద్దరూ 548 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఏజెన్సీలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో రావణాపల్లి పాఠశాలకు చెందిన జి.దివ్య అత్యధిక మార్కులు సాధించినట్లు ఎటిడబ్ల్యుఒ క్రాంతి కుమార్ తెలిపారు. 14 ఆశ్రమ పాఠశాలల నుంది 513 మంది పరీక్ష రాయగా, 511 మంది పాసైనట్లు వెల్లడించారు.
మండలంలో 59 శాతం ఉత్తీర్ణత
అడ్డతీగల : 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో అడ్డతీగల మండలం 59 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఇఒ మల్లేశ్వరరావు తెలిపారు. మండల మొత్తంగా 367 మంది పరీక్షలకు హాజరు కాగా 218 మంది ఉత్తీర్ణత సాధించారని, 149 మంది ఫెయిలయ్యారని పేర్కొన్నారు. వెదురునగరం జివికె స్కూల్ చెందిన జర్తా మౌనిక (550) మార్కులతో మండలం టాపర్‌గా నిలవగా, ఏపీఆర్ గురుకుల పాఠశాలకు చెందిన జగు రాజుకుమార్ (549) ద్వితీయ స్థానంలో నిలిచారు. వారిద్దరికి ఎంఈఓ మల్లేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వెదురు నగరం స్కూల్లో 20 మంది పరీక్షకు హాజరుకాగా 20 మంది పాసై 100శాతం ఉత్తీర్ణత సాధించారు. గురుకుల పాఠశాలలో 75 మందికి 55 మంది, రాయపల్లి జెడ్పీ హైస్కూల్‌లొ ఆరుగురికి ముగ్గురు, ఎల్లవరం జెడ్పీ హైస్కూల్‌లో 23 మందికి 16 మంది, అడ్డతీగల ఆశ్రమ పాఠశాలలో 24 మందికి 16 మంది, వీరవరం ఆశ్రమ పాఠశాలలో 11 మందికి ఐదుగురు, డి.భీమవరం ఆశ్రమ పాఠశాలలో 39 మందికి 26 మంది, అడ్డతీగల జెడ్పీ హైస్కూల్‌లో 64 మందికి 35 మంది, గొంటువానిపాలెం జెడ్పీ హైస్కూల్‌లో 39 మందికి 20 మంది, అడ్డతీగల ఆశ్రమ పాఠశాల బాలికల పాఠశాలలో 66 మందికి 25 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఇఓ మల్లేశ్వరరావు తెలిపారు.
మండలంలో 70 శాతం ఉత్తీర్ణత
ఎటపాక : పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండలంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 2 ఆశ్రమ పాఠశాలలు, కేజిబివి, ఒక ప్రైవేట్ పాఠశాల నుండి మొత్తం 255 మంది హాజరుకాగా, 177 మంది ఉత్తీర్ణులయ్యారు. నందిగామ ఉన్నత పాఠశాలలో 21 మందికి 13 మంది, నెల్లిపాక ఉన్నత పాఠశాలలో 33 మందికి 21 మంది, సీతాపురం ఉన్నత పాఠశాలలో 24 మందికి 14 మంది, గౌరిదేవిపేట ఉన్నత పాఠశాలలో 18మందికి 10 మంది, పినపల్లి ఉన్నత పాఠశాలలో 24 మందికి 18 మంది, గొల్లగూడెం ఉన్నత పాఠశాలలో 16 మందికి 10 మంది, కెఎన్ పురం ఆశ్రమ పాఠశాలలో 40 మందికి 32 మంది, నల్లకుంట ఆశ్రమ పాఠశాలలో 26 మందికి 16 మంది, కేజిబివిలో 37 నుండి 27 మంది, శ్రీఆదిత్య స్కూల్‌లో 16 మందికి 16 మంది ఉత్తీర్ణత సాధించారు. నెల్లిపాక ఉన్నత పాఠశాలకు చెందిన పి.సాయి శంతన్ 563 మార్కులతో ప్రథమ స్థానంలోనూ పి.వివేక్ 536తో ద్వితీయ స్థానంలో నిలిచారు.
95 శాతం ఉత్తీర్ణత
రంపచోడవరం : పదవ తరగతి ఫలితాలలో రంపచోడవరం మండలంలో 95 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచినట్లు ఎంఇఒ కె సత్యనారాయణ దొర తెలిపారు. మండలంలో 16 మంది విద్యార్థులు 500 పైబడి మార్కులు సాధించారు. కె.ఎర్రంపాలెం ఆశ్రమ పాఠశాల నుంచి 21 మంది పరీక్షలకు హాజరుకాగా 14 మంది ప్రథమ శ్రేణి, ఆరుగురు ద్వితీయ శ్రేణిలో పాసయ్యారు. కోసు బుచ్చరాజ్యం 527 మార్కులు సాధించింది. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాలకు చెందిన మన్నె సుబ్బలక్ష్మి 565 మార్కులు, నవదీప్ 547 మార్కులు సాధించినట్లు పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం అందాల రామారావు తెలిపారు.
మండల టాపర్‌గా చరణ్ తేజ్
రాజవొమ్మంగి : మండలంలో 471 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 327 మంది ఉత్తీర్ణులై 70 శాతం పాసైనట్లు ఎంఈఓ కె.తాతబ్బాయిదొర తెలిపారు. రాజవొమ్మంగి జెడ్‌పి హైస్కూల్‌కు చెందిన మిరియాల చరణ్ తేజ్ 565 మార్కులతో మండల టాపర్‌గా నిలవగా, జడ్డంగి జెడ్‌పి హైస్కూల్‌కు చెందిన కొండేపూడి నాగ చక్రధర్ 529తో ద్వితీయ స్థానం, ఎపి గురుకుల బాలికల పాఠశాలకు చెందిన కోసూరి విష్ణు దుర్గాదేవి 522తో తృతీయ స్థానం సాధించారు. రాజవొమ్మంగి జెడ్‌పి స్కూల్‌లో 124 మందికి 57 మంది, లాగరాయి జెడ్‌పి స్కూల్‌లో 14 మందికి 10, జడ్డంగి జెడ్‌పి స్కూల్‌లో 30 మందికి 27, స్థానిక ఏపీ గురుకుల పాఠశాలలో 81 మందికి 68, బోర్ణగూడెం ఆశ్రమ పాఠశాలలో 60 మందికి 47, అమీనాబాద్ ఆశ్రమ పాఠశాలలో 28 మందికి 26, జడ్డంగి ఆశ్రమ పాఠశాలలో 20 మందికి 20, సింగంపల్లి ఆశ్రమ పాఠశాల నందు 40 మందికి 39 మంది, రాజవొమ్మంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో 18 మందికి 7, రాజవొమ్మంగి బాలుర ఆశ్రమ పాఠశాలలో 48 మందికి 26 మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈఓ తెలిపారు.
మండల టాపర్‌గా హన్సిక
చింతూరు : చింతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గొడే హన్సిక టెన్త్ ఫలితాల్లో 545 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. సీసం జ్యోతిర్మయి 541 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది.
అనంతగిరి:మండలంలోని పదో తరగతి పరీక్ష ఫలితాలలో 14 పాఠశాల విద్యార్థులు 686 మంది పరీక్షలలో పాల్గొనగా 632 మంది ఉత్తీర్ణత సాధించారు. మండల విద్యాశాఖ సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తేవాలని కోరారు
అరకులోయ:పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది అరకులోయ మండలంలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. మండలంలో 14 స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు పరీక్షలు రాయగా, వీటిలో ఏపీటీడబ్ల్యూ ఆర్‌ఎస్ అరకులోయ (జి )మొత్తం86 మంది పరీక్షలు రాయగా 80 మంది ఉత్తీర్ణత సాధించారు.ఏపీ టీ డబ్ల్యూ ఆర్ ఎస్(పిటిజి బార్సు ) 76 మందికి 56, ఏపీ టీ డబ్ల్యూ ఆర్ ఎస్( స్పోర్ట్స్ )29 మందికి 27 మంది, కేజీబీవీ( ఎండపల్లి వలస) 33 మందికి 19 మంది, గవర్నమెంట్ హైస్కూల్ (కంటబంస్ గూడా ) 56 మందికి 16 మంది, జిటి డబ్ల్యూ ఏఎస్ (బార్సు కంట బౌన్స్ గూడ) 103 మందికి 28 మంది, జిటీడబ్ల్యూ ఏఎస్ కొత్త భల్లు గూడ (జి )117 మందికి 27 మంది, జిటీడబ్ల్యూఏఎస్ అరకులోయ (జి ) 83 మందికి 41 మంది, జిటీ డబ్ల్యూ ఏఎస్ (బార్సు రవల్లగూడ) 59 మందికి 14 మంది, జిటీడబ్ల్యూ ఏఎస్ గన్నెల(జి )64 మందికి 6, జి టీ డబ్ల్యూ ఏఎస్ (బార్సు లోతేరు)24 మందికి 6, జిటీ డబ్ల్యూ ఏఎస్ బాస్కి (బార్సు ) 31 మందికి 1, బివి కే హై స్కూల్ 11 మందికి 11, శారదా నికేతన్ 12 మందికి 11 మంది చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బివికె హైస్కూల్ శతశాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఈ పాఠశాలలోని పి.యామిని 564 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. ఏపీటీడబ్ల్యూ ఆర్‌ఎస్( జి) పాఠశాలకు చెందిన ఎం.దీప్తి 528 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. అరకులోయ మండలంలో గత ఏడాది నుంచి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గణనీయంగా ఉత్తీర్ణత శాతం పడిపోతుండడం గమనార్హం.










