ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అమ్మ చారిటబుల్ ట్రస్టు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.అనురాధ, ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు చేతులు మీదుగా విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్‌ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గొంప వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా కష్టపడి చదివి 100శాతం మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచిపేరు తేవాలని కోరారు. ఉపాధ్యాయులు సూరెడ్డి బాబూరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఐక్యంగా కృషి చేసి పరీక్షల్లో మంచి మెరిట్ సాధించాలన్నారు. బయాలజీ ఉపాధ్యాయులు లెక్కల ఎరుకు నాయుడు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సింగంపల్లి అర్జున, ట్రస్ట్ సభ్యులు లెక్కల సత్యనారాయణ, లెక్కల కోటేశ్వరరావు, యడ్ల గోవింద, ఉపాధ్యాయులు, 90 విద్యార్థులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండలంలోని వేచలం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన పాఠశాల హెచ్‌ఎం డిఎన్.మూర్తి, ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు, పూర్వ విద్యార్థుల చేతులు మీదుగా గురువారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రెడ్డి శేషగిరిరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివితే ఉత్తమ స్థానంలో ఉంటారన్నారు. ట్రస్ట్ చైర్మన్ గొంప వెంకటరావు, ఉపాధ్యాయులు సూరెడ్డి బాబూరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు లెక్కల సత్యనారాయణ, సిహెచ్.నాగేష్, వేచలపు వంశీ, ఉపాధ్యాయులు, 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.










