
ప్రజాశక్తి-నక్కపల్లి:చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని హెచ్‌ఎం కోడి శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. మండలంలోని వేంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం హెచ్‌ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులతో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పది ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు అయినంపూడి మణిరాజు సత్కరించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం కోడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిభ, తెలివి తేటలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నక్కపల్లి:మండలంలోని డొంకాడ గ్రామానికి చెందిన నార్ని రామకృష్ణ తనయుడు వెంకట దుర్గ పది పరీక్షా ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచాడు. గొడిచెర్ల హైస్కూల్లో పదో తరగతి పరీక్షల్లో 600కు గాను 584 మార్కులు సాధించాడు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో సీతారామరాజు, ఎంపీపీ రత్నం, ఉపాధ్యక్షులు వీసం నానాజీ, డొంకాడ గ్రామ సర్పంచ్ కొండలరావు, స్కూల్ కమిటీ చైర్మన్ రాజు, ఏపీఓ ఈశ్వరరావు వెంకట దుర్గను అభినందించి సత్కరించారు.
గొలుగొండ: చోద్యం జెడ్పీ హైస్కూల్ 10వ తరగతి పరీక్షల్లో మొదటి స్ధానం సాధించిన పాడిశెట్టి దుర్గాప్రసాద్‌ను లింగంపేట టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. లింగంపేటకు చెందిన దుర్గాప్రసాద్ పదవ తరగతి పరీక్షల్లో 549 మార్కులతో మొదటి స్ధానంలో నిలిచాడు. ఈ కార్యక్రమంలో రమణ, శ్రీకాంత్, ననర్సింగరావు, తాతాజీ పాల్గొన్నారు.
రోలుగుంట: హెడ్ కానిస్టేబుల్ సురేష్ కుమార్తె సౌమ్య ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 522 మార్కులు సాధించడంతో కొత్తకోట సిఐ సయ్యద్ ఇలియాజ్ మహహ్మద్, రోలుగుంట ఎస్సై నాగకార్తీక్‌లు ఆమెను అభినందించి బహుమతులు అందజేశారు.
శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
నర్సీపట్నం రూరల్:టెన్త్ ఫలితాల్లో స్థానిక శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ నుండి లాలం హేమంత్ కుమార్ 591 మార్కులతో మండలంలోనే అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ చిటికెల శ్రీను, డీన్ వానపల్లి నాగేశ్వరరావు, గాజువాక రీజినల్ ఇంచార్జ్ ఎం.రమణ తెలిపారు. వీరికి పాఠశాలలో సోమవారం అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ స్కూల్‌లో ఎస్.వేదశ్రీ (589 మార్కులు), డీ.టీ.వీ.ఆదిత్య (589 మార్కులు) సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. 22 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు సాధించగా 54 మంది విద్యార్థులు 570 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 107 మంది విద్యార్థులు 560 పైబడి మార్కులు సాధించారు ఉపాధ్యాయేతర బృందాన్ని ఉత్తర ఆంధ్ర జోన్ ఏ.జీ.ఎం ఎం.వి సురేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఎకడమిక్ కోఆర్డినేటర్ లెంక రాజేష్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ రమణ, ప్రైమరీ ఇంచార్జ్ మైథిలి, క్యాంపస్ ఇంచార్జ్ పాండురంగ నాయుడు పాల్గొన్నారు.