ప్రజాశక్తి-నక్కపల్లి:
నక్కపల్లి, ఎస్.రాయవరం మండలం లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన టెన్త్ క్లాస్ మోడల్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం నక్కపల్లి సిఐటియు కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రమణ మాట్లాడుతూ, పరీక్షలంటే విద్యార్థుల్లో భయాందోళన పోగొట్టడానికి, వారిలో ఉన్న ప్రతిభను వెలుగు తీసేందుకు గాను పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ మోడల్ టెస్ట్ నిర్వహించామన్నారు. ఈ మోడల్ టెస్ట్‌లో సుమారుగా 17 స్కూల్ నుండి 730 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. మొదటి స్థానంలో ఎస్ నాగసాయి ప్రవీణ్ ( శ్రీ ఆదర్శ స్కూల్), రెండవ స్థానం పి.బేబీ (విశ్వశాంతి హైస్కూల్), మూడవ స్థానం జి బిందు (గర్ల్స్ హైస్కూల్ ,నక్కపల్లి) స్థానాల్లో నిలిచినట్లు పేర్కొ న్నారు. ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు ఈనెల 20న బహుమతుల ప్రధాన చేయడం జరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బి.బాబ్జి, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.బాలాజీ పాల్గొన్నారు.










