క్రోసూరు: పెదకూరపాడు నియోజకవర్గస్థాయిలో జరిగిన టెన్ని కాయిట్ ఆటటో క్రోసూరు సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యా ర్థినులు ప్రతిభ కనబరిచారు. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం ఈ పోటీలు జరిగాయి. అండర్-17 బాలికల విభాగంలో విద్యార్థినులు కె.పూజిత, కె.తిరుమల, ఎం.చైతన్య లక్ష్మి, అం డర్-14 బాలికల విభాగంలో కె .రీనా సిగ్మా ఫ్లారెన్స్, బి.చందన విశేష ప్రతిభ కనబరిచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల పిఈటి మక్కెన వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ మేరీ రజిత మాట్లాడుతూ నియోజకవర్గస్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపిక కావాలని విద్యార్థినులకు స్ఫూర్తి నిచ్చారు. ఈ సందర్భంగా విద్యా ర్థినులను ఉపాధ్యాయుడు విజరు కుమార్ అభినందిం చారు.










