
ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్‌గా సయ్యద్ ఖలేదా నసీం రాజీనామా చేసిన నేపథ్యంలో సోమవారం సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సీనియర్ వైస్‌చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ సమావేశాన్ని నడిపిస్తారని మున్సిపల్ మేనేజర్ అప్పలరాజు ప్రకటించారు. హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి అజెండాలోని 12వ అంశమైన సయ్యద్ ఖలేదా నశీం రాజీనామా, ఇతర అంశాలనూ అమోదించారు. సీనియర్ వైస్‌చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కమిషనర్ ఎం.జస్వంతరావు ప్రకటించగా ఆ స్థానంలో ఆయన కూర్చున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇన్‌చార్జి చైర్మన్‌గా అపవకాశం కల్పించిన ఎమ్మెల్యే శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యుల సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కౌన్సిల్ సభ్యులు, అధికారులు ఆయనను శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో వైస్‌చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ ఇంజనీర్ కె.శివనాగమల్లేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇన్‌చార్జి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యేను వైసిపి కార్యాలయంలో హరిప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, పలువరు ఆర్యవైశ్య ప్రముఖులు హరిప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.