Sep 25,2023 23:30

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసనలో ప్రజాసంఘాలు

తెనాలి: 'రోడ్లపై గుంతలు పూడ్చాలి..రోడ్ల నిర్మాణం చేపట్టాలి.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి' అంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కె.బాబుప్రసాద్‌ మాట్లా డుతూ తెనాలి-దుగ్గిరాల ఆర్‌అండ్‌బి రోడ్డు అధ్వానంగా ఉందని,గుంతల మయంగా మారిందని అన్నారు. ద్విచక్ర వాహనాలు సైతం ప్రయాణించలేని స్థితిలో ఉందని, ఆ రోడ్డులో బస్సులు, ఆటోల్లో ప్రయాణం చేయడం కనాకష్టంగా ఉందని అన్నారు. ముందస్తుగానే రోడ్‌ ట్యాక్స్‌ వసూలు చేసే ప్రభుత్వం రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణమే గుంతలు పూడ్చి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమ ర్పించారు. కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నాయకలు బి.బ్రహ్మారెడ్డి, ఆర్‌.శివకృష్ణ, ఆర్టీసి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కన్నెగంటి శివశంకరరావు, ఎస్‌. సుబ్రహ్మణ్యం, కె.భాస్కరరావు, దుర్గాప్రసాద్‌, రాడ్‌బెండింగ్‌ యూనియన్‌ నాయకులు ఎం.రవికుమార్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.సాంబశివరావు, ఎస్‌డి సిరాజుద్దీన్‌, వి.ఆదినారా యణ, పిఎస్సార్‌ కృష్ణ, టి.రాములు, హబీబుల్లా పాల్గొన్నారు.