Nov 10,2023 23:46

సమావేశంలో మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

ప్రజాశక్తి - కొల్లిపర : వైసిపి పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని, టిడిపిని అధికారంలోకి తేవడానికి కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. తెనాలి నియోజకవర్గ అభ్యర్థిని రెండు పార్టీలు కలిసే నిర్ణయిస్తాయని, దానికనుగుణంగా పని చేయాలని చెప్పారు. సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు బి.చిన్నకోటిరెడ్డి, నాయకులు వి.సాంబిరెడ్డి, జి.గోవర్ధన్‌రెడ్డి, కె.కోటిరెడ్డి, పి.జోగేంద్ర పాల్గొన్నారు.