Oct 16,2023 20:44

చమర్తి జగన్‌ మోహన్‌రాజుధ్యక్షులుగా 'చమర్తి'

రాజంపేట అర్బన్‌: తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్‌మోహన్‌ రాజును అధిష్టానం నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నా యుడు ఈ మేరకు చమర్తిని నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. చమర్తి ఆది నుంచి పార్టీకోసం పనిచేస్తూ ఒడిదుడుకులు అధిగమించి నియోజకవర్గ స్థాయిలో విస్తత స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్యాడర్‌కు అండగా నిలబడుతూ వచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అహర్నిశలు కషి చేస్తూ మొక్కవోని దీక్షతో విధేయుడిగా పేరుగాంచిన చమర్తికి నేటికైనా అధిష్టానం గుర్తింపునిచ్చి గౌరవించినందుకు ఆయన అనుచరులు, వర్గీయలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చమర్తికి అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే నియోజకవర్గంలో పసుపు జెండా పాతే స్తారని అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మోహన్‌ రాజు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై విశ్వాసముంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ బాబు, అచ్చెన్నాయుడు, తనకు అండగా నిలబడిన శ్రేయోభి లాషులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. పదవి మరింత బాధ్యతను పెంచిందని, జిల్లా స్థాయిలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పార్టీ బలోపేతం చేస్తూ 2024 ఎన్నికలే లక్ష్యంగా కషి చేస్తూ నారా చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా సైనికుడిలా పోరాడి కషి చేస్తానని పేర్కొన్నారు.