Sep 26,2023 20:48

రాజంపేట : అర్ధనగ నిరసన తెలుపుతున్న తెలుగు యువత, టిడిపి నాయకులు

మదనపల్లె అర్బన్‌ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్న బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటానికి మేము సైతం రిలే నిరాహారదీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం తెలుగు యువత నాయకులు అర్థనగ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకో పాలన నుండి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకులు దొమ్మలపాటి యశశ్వి రాజ్‌, ఆర్‌.జె.వెంకటేష్‌, ఎస్‌.ఎం.రఫీ, మోడెం సిద్ధప్ప, తులసీధర్‌ నాయుడు, పట్టణ అధ్యక్షులు జోళపాలెం భవాని ప్రసాద్‌, ఉపాధ్యక్షులు యర్రబెల్లి వెంకటరమణారెడ్డి, బొమ్మిశెట్టి పురుషోత్తం, గుత్తికొండ త్యాగరాజు, చంద్రశేఖర్‌, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో యావత్తు రాష్ట్రమే అండగా ఉంటుందని జనసేన నాయకులు తెలిపారు. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శ్రీనివాసులు, జడ్డా శిరీష, భాస్కర పంతులు, చౌడయ్య, తోట వెంకటసుబ్బయ్య, వీరయ్య ఆచారి, రాఘవ మంగళవారం దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందలూరు మండలం ఇసుకపల్లి చెయ్యేరులో టిడిపి ఆధ్వర్యంలో అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. టిడిపి సీనియర్‌ నాయకులు చమర్తి జగన్మోహన్‌రాజు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ జనసందోహంతో పాల్గొన్నారు. అనంతరం మదనగోపాలపురంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.