
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గురువారం గుంటూరు, పల్నాడు జల్లాలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా తెలుగుయువత ఆధ్వర్యంలో స్థానిక బృందావన్‌గార్డెన్స్‌లో నిరాహారదీక్షలు చేపట్టారు. జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కష్ణ, టిడిపి నాయకులు కోవెలమూడి రవీంద్ర నాని, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అర్బన్ టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్ ,నియోజకవర్గ టిడిపి పరిశీలకులు సింహాద్రి కనకాచారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కష్ణ ,స్థానిక కార్పొరేటర్ మానం పద్మశ్రీ , సిపిఐ రైతు నాయకులు,మహిళలు ప్రజాసంఘాలు పెద్దసంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.