
పల్నాడు జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జరగ నున్న నేపథ్యంలో అంతర్ జిల్లా, అంత ర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నగదు, మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే నిమిత్తం బుధవార సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎల్.శివ శంకర్, ఎస్పీ వై. రవి శంకర్ రెడ్డితో కలిసి పెన్నా సిమెంట్స్ సమావేశ మందిరంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్‌వికర్ణన్, ఎస్పీ అపూర్వరావుతో ఈ సమావేశం నిర్వహించారు. నిబంధ నలను అతిక్రమించి అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరగకుండా ఉండే విధంగా నిరంతర నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. పల్నాడు జిల్లా సరిహద్దులో ఉన్న సూర్యాపేట, తెలంగాణ జిల్లా నల్గొండ జిల్లాలకు రాకపోకలు సాగించే పోలీసు శాఖకు సంబంధించి 9 చెక్‌పోస్టులు, ఎక్సైజ్ శాఖకు సంబంధించి రెండు చెక్‌పోస్ట్‌లు, అటవీ,రవాణా శాఖకు సంబంధించిన చెక్‌పోస్ట్ ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు చెప్పారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ శివశంకర్ పొందుగల ,వడపల్లి వద్ద చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందజేశారు.