ప్రజాశక్తి-భట్టిప్రోలు: తెలుగు పిజి సెట్‌లో కాకుమాను నవ్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు లభించింది. ఈ మేరకు పెదనందిపాడులో తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నవ్యకు జరిగిన అభినందన సభలో రాష్ట్ర ఐద్వా కార్యదర్శి డి రమాదేవి పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన చేసే నేటి తరుణంలో తెలుగులో సరిగా మాట్లాడలేక సతమతమవుతున్నారని, అలాంటిది తెలుగుపై మక్కువతో నవ్య తెలుగు పండిట్‌గా మొదటి ర్యాంక్ సాధించటం అభినందనీయమని అన్నారు. విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నవ్యకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని కమిటీ సభ్యులు నర్రా బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకుమాను నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకట శివరావు, మద్దూరి రమణ, భువనేశ్వరి, శేషగిరిరావు తదితరులు ఉన్నారు.










