Oct 30,2023 22:59

ప్రజాశక్తి - నల్లజర్ల 2024 జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభను జయప్రదం చేయాలని మహాసభల కో-ఆర్డినేటర్‌ గజల్‌ శ్రీనివాస్‌ అన్నయ్య శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో సోమవారం గోపాలపురం జోన్‌ ప్రయివేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ కరస్పాండెంట్స్‌తో ప్రత్యేక సమావేశం జరిగింది. స్కూల్‌ డైరెక్టర్‌ అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 5, 6, 7 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిస్కూల్‌ కరస్పాండెంట్‌తోపాటు, ప్రతిభ గల విద్యార్థులు పాల్గొనేలా దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పెనకటి శివాజీ, కార్యదర్శి ఆతుకూరి సుధీర్‌ కుమార్‌, ట్రెజరర్‌ జి. ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.