Nov 03,2023 17:07

తెలుగు గంగ ఆఫీసు సూపరింటెండెంట్ కు వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం నేతలు

తెలుగు గంగ ఆయకట్టుకు నీరు ఇవ్వండి
రైతు సంఘం నేతల డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

          తెలుగు గంగ ఆయకట్టు భూములకు డిసెంబర్ చివరివరకు సాగునీరు ఇవ్వాలని వారబంది పద్ధతిద్వారా  10 రోజులనుండి 15 రోజులవరకు నీటిని పొడిగించాలని  ఆంధ్ర ప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎ. రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు వి. సుబ్బరాయుడు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రత్నమయ్య, రైతుసంఘం నాయకులు రాజు, జగదీశ్వర్ రెడ్డి లు నంద్యాల తెలుగుగంగ ఎస్ఈ కార్యాలయంకు వెళ్లారు. అక్కడ ఎస్ ఈ, ఈ ఈ లు ఎవ్వరు అందుబాటులో లేకపోవడంతో ఎస్ ఈ ఆఫీస్ సూపరిండెంట్ కు   వినతిపత్రం  సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా  బండి ఆత్మకూరు, మహానంది, నంద్యాల, శిరివెళ్ల, రుద్రవరం, ఆర్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో వరి సాగు రైతులు వేల రూపాయలు పెట్టుబడిపెట్టి నష్టపోయారని మల్లీ ఈ సంవత్సరం అప్పులు చేసిపంటలు వేసిన రైతులు, సరైన వర్షాలు కురువక, తగినంత సాగునీరు అందక పంటలు ఎండి పోతున్నాయని పేర్కొన్నారు.తెలుగు గంగ కాలువ ద్వారా వారబంది పద్ధతి ద్వారా 10 రోజు లకు ఒకసారి నీళ్లు ఇస్తున్న కూడా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదని,పంటలు చేతికి వచ్చే ఈ చివరి రోజులలో సరిపడా నీరు అందించక పోతే పంటలు బొందుపోయి పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందు తున్నారన్నారు.కాబట్టి వారబంది పద్ధతి ద్వారా 15 రోజుల వరకు నీరివ్వాలని ఎంఎల్ఏ లు,జిల్లా కలెక్టర్ తెలుగు గంగ అధికారులు వెంటనే స్పందించి రిజర్వాయర్ లో ఉన్న నీటిని పంట పొలాలన్నింటికినీరందించి,రైతులను వెంటనే ఆదుకోవాలని, లేనియెడల రైతులందరినీ సమీకరించి తెలుగు గంగ కార్యాలయం ముందు ఆందోళన చెప్పడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి,ఏ. జమాల్ వలి తదితరులు పాల్గొన్నారు.