Sep 09,2022 23:51

ఆచార్య యార్లగడ్డకు సత్కారం

అధికార భాషాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ
ఘనంగా జాతీయ సాహిత్య సంబరాలు
ప్రజాశక్తి-సింహాచలం:
రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలు తెలుగు భాషను అపహాస్యం చేస్తున్నాయని, ద్వితీయ భాషగా తెలుగు కాకుండా, సంస్కృతాన్ని అమలు చేయడం ఎంతమాత్రం సరికాదని అధికార భాష సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు శుక్రవారం సింహాచలంలో జాతీయ సాహిత్య సంబరాలను జ్యోతిప్రజ్వళనతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగు భాషను ప్రతి ఒక్కరు విధిగా అమలు చేసేలా అధికార భాష సంఘం తరఫున కృషి చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో విధిగా తెలుగు భాష అమలుపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టమైన ఆదేశాలు, జిఒ జారీ చేశారన్నారు. దీన్ని ఎవరు ఉల్లంఘించినా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఆహ్వాన పత్రాలు శిలాఫలకాలు ఉత్తర ప్రత్యుత్తరాలు అధికార ఆదేశాలు ప్రజల కోసం జారీ చేసే పత్రాలు ఇలా అన్నీ కూడా తెలుగు భాషను అమలు చేయాలని స్పష్టం చేశామన్నారు. దీనిపై మరోమారు జిల్లాలో పర్యటించి, తెలుగు భాషను అమలు చేయాలని స్పష్టం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువు రచయితలు, కవులు పాల్గొన్నారు.