తెలుగు భాష, సంస్కతిని విశ్వవ్యాప్తం చేయాలి
- వీసీ ఆచార్య డి భారతి
ప్రజాశక్తి - క్యాంపస్ : తెలుగు భాషా, తెలుగు సంస్కతి, సంప్రదాయాలు, కళలు, కళారూపాలు, సంగీతం, నాట్యం, గానం, వాగ్గేయ, కథాకళి సంపదలు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి భారతి పిలుపు నిచ్చారు. తెలుగు వ్యక్తి చిగురుమళ్ళ శ్రీనివాస్ 'వందే విశ్వమాతరం' పేరుతో 100 దేశాల సందర్శనకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వెలుగులు విరజిమ్ముతూ, తెలుగు సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ, విశ్వశాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రకతి రక్షణ, మానవీయ విలువలు వంటి గొప్ప లక్ష్యాలతో చిగురుమళ్ళ శ్రీనివాస్' వందే విశ్వమాతరం' పేరుతో 100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్రకు శ్రీకారం చుట్టారు. వీరు 100 శతకాలు రాశారు. నవంబర్ 9 వ తేది ఆఫ్రికా ఖండంలోని బోట్స్ వాన దేశంలో ఈ అపూర్వ యాత్ర ప్రారంభమ వుతుందన్నారు. ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు నిరంజన్ శంగరపు, తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరం చైర్మన్ జయశేఖర్ తాళ్ళురి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినంద నీయమన్నారు. 2016 నుంచి శ్రీ పద్మావతి మహిళా విశ్వావిద్యాలయంలోని సంగీత విభాగానికి, అమెరికాలోని తానాతో సత్సంబంధాలు ఉండటం వల్ల విసి ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని, ఇంటర్నేషనల్ డీన్ ఆచార్య విజయలక్ష్మి, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య మధుజ్యోతి, డా. సుభాషిణి, డా. యువశ్రీ కలిసి ఈ కార్యక్రమ గోడపత్రికను విడుదల చేసి శ్రీనివాస్ కి అభినందనలు తెలిపారు.










