తెలంగాణలో టిఆర్‌ఎస్ గెలవాలని గంగమ్మకు పూజలు
తెలంగాణలో టిఆర్‌ఎస్ గెలవాలని గంగమ్మకు పూజలు
తిరుపతి టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ గెలవాలని శుక్రవారం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో తిరుపతి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు ఆర్కాట్ కష్ణ ప్రసాద్ పూజలు నిర్వహించారు. ఆర్కాట్ కష్ణప్రసాద్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు కెసిఆర్ ముచ్చట గా మూడోసారి ముఖ్యమంత్రిగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని గంగమ్మను కోరినట్లు తెలిపారు.భవిష్యత్తులో కెసిఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆలయ ఛైర్మెన్ కట్టా గోపి యాదవ్ , ఆలయ అర్చకులు ఆర్కాట్ కష్ణప్రసాద్ కు అమ్మవారి కండువాకప్పి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు బెల్లంకొండ సురేష్, డి.రాఘవరెడ్డి, సదుంప్రసాద్ పాల్గొన్నారు.










