Nov 01,2023 20:21

ఎమ్మిగనూరులో మాట్లాడుతున్న సురేష్‌

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం ఉద్యమించాలని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌ కోరారు. బుధవారం పట్టణంలోని డివైఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్‌ఐ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులు అజిత్‌ అధ్యక్షత వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివైఎఫ్‌ఐ నేడు దేశంలోనే 2.10 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద యువజన సంఘంగా ఎదిగిందని తెలిపారు. యువతకు ఉపాధి కావాలంటూ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించినట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి అనేకమంది అమరులైన ఘనమైన చరిత్ర కలిగిన సంఘం డివైఎఫ్‌ఐ అని తెలిపారు. నాయకులు రవి, భాస్కర్‌, ఉపేంద్ర, నాగరాజు, శ్రీకాంత్‌, వారి, వివేక్‌ పాల్గొన్నారు. ఆలూరులోని మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌ ఆవరణలో డివైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మైనా జెండాను ఆవిష్కరించారు. డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్‌ అధ్యక్షత వహించారు. డివైఎఫ్‌ఐ నాయకులు రహమాన్‌, బసవరాజు, బీరప్ప, కార్తీక్‌ పాల్గొన్నారు.

ఆలూరులో జెండావిష్కరణ చేస్తున్న మైనా
ఆలూరులో జెండావిష్కరణ చేస్తున్న మైనా